ఓ ఆదివాసీ
- How Adivasi languages are at threat by dominant cultures and states’ apathy - August 9, 2020
- ఓ ఆదివాసీ - November 7, 2019
- O Adivasi - November 7, 2019
To read English translation of the poem, click here.
వానోస్తే తడుస్తావ్
ఎండొస్తే ఎండుతావ్
చలొస్తే వణకుతావ్
ఉన్న పూట తింటావ్
లేని రోజు పస్తులుంటావ్
నువ్వు ఎవ్వరి జోలికి పోవు
కానీ నీ జోలికి చాలా అతీత శక్తులు వస్తాయి
అందులో కొన్ని నీకు ఉపకారం చేస్తే
మరికొన్ని తీరని అపకారం చేస్తాయి
నీ అమాయకత్వం వల్ల అడవి నాదే అనుకున్నావు
అడవిలో దొరికే ఆహారము తిని బతికే
నీకు ఈ అడవి నీది కాదు అన్నారు
నీ పొట్టకొట్టారు
నీకు గూడు లేకుండా చేసారు
కష్టపడి పోడు కొట్టి రెండు గింజలు
పండించి బతకుదామంటే
పోడు నీది కాదు అన్నారు
బలవంతముగా లాక్కోన్నారు
నువ్వు తరతరాలుగా జీవిస్తున్న
భూమి నుండి నిన్ను తరిమి కొడుతున్నారు
నీ చుట్టు ఉన్న సహజ సంపదను
నీకు తెలియకుండా నీ సహకారం తోనే దోచుకొంటున్నారు
ఇకనైనా మేల్కొక పోతే
ఆదివాసుల మనుగడ ఈ భూమ్మీద కష్టమే
జాతి, భాష, సంస్కృతి-సాంప్రదాయలు, కట్టు-బొట్టు, మరియు జీవన విధానాలు కాపాడుతూ ముందుకు
సాగల్సిన అవసరం ప్రతి ఆదివాసీ పై ఉంది.
Photo: Madakam Lakshman Koya
O my friend this is fact and really
Problem to adivasi. Congratulations
Anna Naku mana language radhu but Neenu nerchukunta adhi ela
Help me please